జగిత్యాల జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 16వ రోజు సమ్మెలో భాగంగా ప్రయాణికులకు పుష్పాలు ఇస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం జరిగిన రాష్ట్ర బంద్కు సహకరించినందుకు ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. మరో ప్రాణం బలి