జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్‌పై ప్రజలకు నాటిక రూపంలో అవగాహన కల్పించారు. డీఎస్పీ వెంకటమరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో యమధర్మరాజు పాశం విసిరే విధానం కళ్లకు కట్టినట్లు చూపించారు. శిరస్త్రాణం ధరించిన యువకుడు సైతం ప్రమాదానికి గురికాగా... అతనికి యమధర్మరాజు పాశం వేసినా.. ప్రాణం తీయలేని స్థితిని వివరించిన తీరు వాహనదారులను ఆకట్టుకుంది.
- ఇదీ చూడండి : ఆపరేషన్ విజయ్: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు