రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Latest weather report) ప్రకటించింది. నిన్న ఆగ్నేయ బంగాళా ఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు మధ్య దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ... సగటు సముద్ర మట్టానికి సమారు 5.8కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని (Telangana rain news ) వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కిందిస్థాయి గాలులు రాష్ట్రం వైపునకు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జగిత్యాలలో వర్షం...
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోని(Rains in jagtial) రాయికల్, మేడిపల్లి మండలాల్లో ఉదయం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) (Imd rain forecast) హెచ్చరించింది. 23, 24 తేదీల్లో ఎల్లో అలర్ట్, 25, 26న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో మరికొన్ని రోజులు తమిళనాడుకు ఈ తిప్పలు తప్పేలా లేవు. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, కరైకల్‌లో కూడా రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఇదీ చదవండి: Ap rains 2021: వానలు ఆగినా.. తప్పని తిప్పలు!