ఆర్టీసీ సమ్మె ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ వెళ్తుండగా గంగాధర వద్ద రోడ్డుపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. చేసేది లేక ప్రయాణికులు కిలోమీటరు మేరా బస్సును తోయాల్సి వచ్చింది. అనంతరం బస్సు ముందుకు కదిలింది. బస్సులను సకాలంలో సర్వీస్ చేయకపోవడం, మెకానిక్‌లు సమ్మెలో ఉండటం వల్ల తరుచు బస్సులు ఆగిపోతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. సాంకేతిక కారణాలతో బస్సు నిలిచిపోయి కొద్దిసేపటికే మళ్లీ స్టార్ట్ అయినట్లు డిపో మేనేజర్ జగదీశ్వర్ వెల్లడించారు.
బండి కాదు ఇది మొండి..కాస్త సాయం పట్టండి..
ఆర్టీసీ కార్మికులంతా సమ్మె బాట పట్టగా అరకొర సర్వీసులను నడుపుతున్న యాజమాన్యానికి సాంకేతిక లోపాలు తలపోటు తెప్పిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు.