జగిత్యాల మండలం ధరూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వాటితో పాటు గ్రామ శివారులో ఉన్న వైన్స్లో షట్టర్ పగులగొట్టి చొరబడి.. మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. గత 10 రోజుల క్రితం జగిత్యాలలో వరుస దొంగతనాలకు పాల్పడ్డ దొంగలు... కాస్త విరామం ఇచ్చి మళ్లీ తెగబడ్డారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తంలో చోరీ జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు.
- ఇవీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన బాలాపూర్ ఏఎస్ఐ మృతి