పాఠాలు బోధించాల్సిన ఓ అధ్యాపకుడు రౌడీగా మారాడు. పిడిగుద్దులతో విద్యార్థిపై విరుచుకుపడ్డాడు. కాలితో తన్నాడు. జగిత్యాలలో ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సిద్ధిరాజ్....మనోజ్ అనే విద్యార్థిని చితకబాదాడు. పక్కన విద్యార్థి చూస్తుంటే అతనిపై కూడా దాడికి దిగాడు. రౌడీ తరహాలో తన్నుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: అధ్యాపకుడిని రౌడీలతో కొట్టించిన స్టూడెంట్