కళాశాల పక్కనే ఏర్పాటు చేసిన వైన్స్ పర్మిట్ రూం అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని గౌతమి డిగ్రీ కాలేజీ పక్కనే వైన్స్ పర్మిట్ రూం ఏర్పాటుపై ఐక్య విద్యార్థి సంఘాల మద్దతుతో కళాశాల విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు