జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పదో తరగతి విద్యార్థుల మాస్కులతో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. ఇన్విజిలేటర్లు కూడా ముఖాలకు మాస్కులు కట్టుకునే విధులు నిర్వరించారు. ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు మాస్కులు కట్టించి మరీ తమ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు పంపించారు.
పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు పరీక్షల భయం లేకున్నా కరోనా భయం పట్టుకుందని పలువురు అభిప్రాయ పడ్డారు.
ఇవీ చూడండి: భారత్లో 151కి చేరిన కరోనా కేసులు- అంతటా బంద్