తెలంగాణలో పేరొందిన ఆలయాల్లో ఒకటైన ధర్మపురికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లక్ష్మీ నారసింహుడే కాదు వేంకటేశ్వరుడు, రామలింగేశ్వర స్వామి విగ్రహాలతో పాటు యమధర్మరాజు కూడా కొలువుతీరారు. ఇక్కడకు వచ్చిన భక్తులు యమధర్మరాజును కూడా తప్పకుండా దర్శించుకుంటారు.
భరణి నక్షత్రం ప్రత్యేకం
ఇవాళ భరణి నక్షత్రం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన ఈ రోజు స్వామికి అర్చకులు రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుసూక్తం, యమసూక్తంతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ధర్మపురి ఆలయం ఒకటి. ఇక్కడ లక్ష్మీ నారసింహుడు లక్ష్మీసమేతంగా కొలువుదీరాడు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఆలయంలో వందల ఏళ్లుగా ఉన్న ఇసుక స్తంభం మరో ప్రత్యేకత.
యమపురి ఉండదు
ఈ ఆలయంలో యమధర్మరాజును దర్శించుకుంటే యమపురి ఉండదని భక్తుల విశ్వాసం. ఇవాళ భరణి నక్షత్రం ప్రత్యేకమైనందున... భక్తులు భారీగా తరలివచ్చి అభిషేకాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: Protest: పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు