ETV Bharat / state

Special Story on Medical Student Mahender : డాక్టర్ అయ్యేందుకు స్పీడ్​ బ్రేకర్​గా పేదరికం.. ఎవరైనా సాయం చేస్తే..! - మెడికల్ స్టూడెంట్ మహేందర్​పై స్పెషల్ స్టోరీ

Special Story on Medical Student Mahender in Jagtial : చదువులో రాణిస్తున్నా.. పేదరికం ఉన్నత చదువుకు అడ్డంకులు సృష్టిస్తోంది. నీట్‌లో మంచి ర్యాంక్‌తో ప్రభుత్వ సీటు సాధించినా.. ప్రతి ఏడాది చెల్లించాల్సిన కనీస డబ్బులు లేక ఇబ్బందులు పెడుతోంది. ఫలితంగా ఫీజులు కట్టలేక వైద్యవిద్యకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జగిత్యాల జిల్లాలోని ఓ యువకుడి ఎదురైన దుస్థితి ఇది. ఫీజు చెల్లించకపోతే.. వైద్యుడిగా ఎదగాలన్న కల నిజం కాదేమోనని ఆందోళన చెందుతున్నాడు ఆ విద్యార్థి. తన కలను నిజం చేసుకోవాలనుకునే మెడికల్ విద్యార్థి మహేందర్​పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథం.

Medical Student Mahender
Special Story on Medical Student Mahender
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 4:10 PM IST

Special Story on Medical Student Mahender డాక్టర్ అయ్యేందుకు స్పీడ్​ బ్రేకర్​గా పేదరికం ఎవరైన సాయంచేస్తే

Special Story on Medical Student Mahender in Jagtial : కటిక నిరుపేద అయిన ఆ విద్యార్థి కష్టపడి చదివాడు. నీట్ (National Eligibility cum Entrance Test) ​లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ప్రభుత్వ సీటు సాధించినా.. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన కనీస డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫలితంగా ఫీజులు కట్టలేక వైద్యవిద్య (Medical Education) కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫీజులు కట్టకపోతే వైద్యుడిగా ఎదుగాలన్న కల నిజం కాదేమోనని ఆ విద్యార్థి ఆందోళన చెందుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన ఎనుగంటి నర్సయ్య, గంగవ్వ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మహేందర్ చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉంటూ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్ బైపీపీ (BIPC)లో 982 మార్కులు సాధించాడు. తొలుత నీట్‌లో 7,000 ర్యాంకు సాధించాడు. అయితే అతనికి సీటు రాలేదు.

Special Story On Nalgonda Shaik Sayyed PhD : తినడానికి తిండి లేని స్థితి నుంచి డాక్టరేట్​గా.. సయ్యద్ ప్రయాణం ఆదర్శప్రాయం

Mahender Secured Seat in Govt Medical College : కరీంనగర్‌లోని ఓ కళాశాల యాజమాన్యం.. ఉచితంగా కోచింగ్ ఇవ్వడం వల్ల ఈసారి నీట్‌లో 527 మార్కులతో 1,580 ర్యాంకు సాధించాడు. దీంతో నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. ఫీజులు, ఇతర ఖర్చులకు ఏడాదికి రూ.2 లక్షల దాకా కావాలి. మహేందర్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో ఫీజులు కట్టకపోతే వైద్యవిద్యకు దూరమవుతానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు గానీ, ప్రభుత్వం గానీ సాయం అందించేలా చూడాలని కోరుతున్నారు.

'కరీంనగర్‌లోని ఓ కళాశాల యాజమాన్యం.. ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో నీట్‌లో 527 మార్కులు సాధించాను. ఇప్పటి వరకు నన్ను కూలి పనులు చేస్తూ చదివించారు. ఇప్పడు ఖర్చు భాగా పెరిపోవడంతో వారికి చాలా ఇబ్బంది అవుతోంది. ఎవరైన సాయం చేయాలని కోరుకుంటున్నా. ఏడాదికి రెండు లక్షల దాకా అవుతున్నాయి. సాయం చేస్తే వైద్యవిద్యని పూర్తి చేద్దాం అనుకుంటున్నా.' -మహేందర్​, మెడికల్ విద్యార్థి

ఆడుకునే వయసులో ప్రాణాంతక వ్యాధి.. సాయం కోసం కన్నవాళ్ల ఎదురుచూపు

Special Story About Medical Student Mahender : కటిక పేదరికంలో ఉన్నా.. కూలిపని చేస్తూ ఇప్పటి వరకు తమ కుమారుడిని చదివించామని మహేందర్‌ తల్లి గంగవ్వ ఆవేదనగా చెబుతున్నారు. అప్పుచేసి మరి చదివించామని.. కానీ డాక్టర్‌ కావాలన్న బిడ్డ కల కలలాగే మిగిలిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మనసున్న వారెవరైన తను మెడిసిన్‌ చదివేందుకు సాయం చేయాలని మహేందర్‌ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఫీజులు కట్టలేక ఉన్నత చదువులకు దూరమవుతున్న మాలాంటి పేద విద్యార్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.

ఎవరూ లేక ఒంటరై.. సాయం కోసం ఎదురుచూస్తూ.. జామ చెట్టు కిందే జీవనం

Blind Man: 'పాటలు పాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అంధుడు.. సాయం కోసం ఎదురుచూపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.