జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంతానయుక్త సాంబశివ నాగేశ్వరాలయంలో కుంకుమ పూజలు, గీత హవన యజ్ఞాన్ని నిర్వహించారు. గీతాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మౌన హరిస్వామి ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు భక్తులు గీతా పారాయణం చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి.
ఇవీ చూడండి: ఏప్రిల్ 1 నుంచి శుద్ధి చేసిన ఇంధనం