ETV Bharat / state

భారత్​కు సోషల్ అండ్​ కల్చరల్ సాయం - భారత్​కు సోషల్ అండ్​ కల్చరల్ సాయం

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకోవడానికి ముందుకువచ్చింది అబుదాబిలోని ఇండియా సోషల్​ అండ్​ కల్చలర్​ సెంటర్. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్​ గత 53 సంవత్సరాలుగా ప్రవాసి భారతీయుల సంక్షేమానికి మూల బిందువుగా ఉంటూ.. ఇండియాకు అవసరం వచ్చినప్పుడల్లా అండగా నిలబడుతున్నారు.

HELP
HELP
author img

By

Published : May 20, 2021, 10:05 PM IST

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాలవారితో పాటు.. వివిధ జిల్లాల వారు కలిసి కరోనా బాధితుల కోసం తన వంతు సాయం చేసి... అండగా నిలిచారు. కరోనా సెకండ్​ వేవ్​లో కరోనా బాధితులకు భారత్​లో ఆక్సిజన్ కొరత ఉండటంతో ఇండియాకు అబూదాబికి చెందిన సోషల్ అండ్​ కల్చరల్ సెంటర్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్స్ ఇండియన్ రెడ్​ క్రాస్​ సోసైటీ దిల్లీ వారికి పంపించారు.

ఇండియా సోషల్ సెంటర్ వారు భారత దౌత్యకార్యాలయ అధికారులను సంప్రదించిన వెంటనే వారు భారత్​కి అందిస్తున్న సహాయంలో భాగంగా ఐఎస్​సీ వారు అందిస్తున్న సహాయాన్ని చేర్చుకోవాల్సిందిగా కోరారు. భారత దౌత్య కార్యాలయం కోరిన మేరకు ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఐఎస్​సీ భారత్​కు విరాళంగా ఇస్తున్న ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా భారత్​కు రవాణా చేస్తున్నారు. నింపిన ఆక్సిజన్ సిలిండెర్లని ఒక ప్రత్యేక ప్యాకింగ్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

ఐఎస్​సీ వారు దేశానికి అందిస్తున్న సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని కార్గో ఉచిత ప్యాకింగ్ అందించడం అయింది. ఆక్సిజన్ సిలిండెర్లని ఎమిరేట్స్ సంస్థవారికి అందించే కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు జార్డ్ వర్గీస్, ప్రధానకార్యదర్శి జోజో జె. అమ్బుకెన్, క్రీడా కార్యదర్శి ఫెడ్డీ జె. ఫెర్నాండెజ్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సి.జార్జ్ వర్గీస్, సంక్షేమ కార్యదర్శి, దక్షిణ భారత కార్యదర్శి రాజా శ్రీనివాస రావు ఐతా పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.