ETV Bharat / state

చెట్లను సంరక్షించిన వారికే సంక్షేమపథకాలు: ఎర్రబెల్లి

జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పర్యటించారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, ప్రభుత్వ భూముల పట్టా సర్టిఫికెట్లను అందజేశారు.

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి: ఎర్రబెల్లి
author img

By

Published : Aug 23, 2019, 11:16 AM IST

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, ప్రభుత్వ భూముల పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో ఇంటికి ఆరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించిన వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని మంత్రి పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ.. హరిత, స్వచ్ఛ గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి: ఎర్రబెల్లి

ఇవీ చూడండి: హీరో రాజ్​ తరుణ్​కు ప్రమాదం నేర్పిన పాఠం!

tg_wgl_63_22_minister_errabelli_paryatana_ab_ts10070 contributor: nitheesh, janagama. .................................................................................( )జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోరు వానలో కూడ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బంజర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన ఎర్రబెల్లి, చిన్నమడూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పెద్దమడూర్ గ్రామంలో వాగుపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంకు జలకల రావడంతో పత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవరుప్పుల మండల కేంద్రంలోఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, ప్రభుత్వ భూముల పట్టా సర్టిఫికేట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసారు. కళ్యాణలక్ష్మీ, షాధీముభారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ...పెళ్లికి ముందే కళ్యాణలక్ష్మీ పథకం అందజేసేందుకు కృషి చేస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇంటికి ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, హరిత, స్వచ్ఛ గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తామని, మొక్కలు సంరక్షించని కుటుంబానికి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని, ఇంటి ముందు చెత్త కనిపిస్తే.. 500 వందల జరిమానా విదిస్తామని తెలిపారు.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే ఆదర్శమని అన్నారు. బైట్: ఎర్రబెల్లి దయాకరరావు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.