కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కరోనా ప్రభావం తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ విధిస్తున్నట్లు పాలకవర్గం తెలిపింది. రెండు రోజుల్లోనే కరోనాతో నలుగురు మృతి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
![Self lock down in ibrahimpatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn12-07-gramamlolockdown-av-ts10037_07042021194819_0704f_1617805099_44.jpg)
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కోసం దుకాణాలు తెరవాలని.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానా విధించాలని పాలక వర్గం నిర్ణయించింది. వీటిని వెంటనే అమలు చేయడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మండలంలోని ప్రధాన కూడళ్ల వద్ద రసాయన ద్రావణాన్ని అధికారులు పిచికారి చేయిస్తున్నారు. ప్రజలు మాస్కు తప్పని సరిగా ధరించాలని ప్రజలకు సూచిస్తున్నారు.