జగిత్యాల జిల్లా కేంద్రంలోని బండారు గార్డెన్లో స్వచ్ఛ హరిత మిషన్ కార్యక్రమంపై సర్పంచులు, అధికారులకు అవగాహన ఏర్పాటు చేశారు. మధ్యలోనే సర్పంచులు కార్యక్రమాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమకు ఉమ్మడి చెక్‌పవర్‌ను తొలగించాలంటూ గొల్లపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గంటకు పైగా నిరసనలు సాగడంవల్ల రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః వానలు కురవాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు