జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. మృతి చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్లకు నివాళులు అర్పించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : శ్రీనివాస్ రెడ్డి మృతిపై జనసేనాని స్పందన