జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ముందుగా బస్సులను సికింద్రాబాద్ వైపు పంపారు. పల్లె వెలుగు బస్సులు సైతం పల్లెబాట పట్టాయి.
లాక్డౌన్ నిబంధనల ప్రకారం ముందుగా డిపోల్లోనే బస్సులను శానిటైజ్ చేసి పంపుతున్నారు. మాస్కు లేకుండగా ఎవరని బస్సులోకి అనుమతించడం లేదు. మొత్తానికి జగిత్యాల జిల్లాలో తొలిరోజు ఒకరిద్దరు ప్రయాణికులతోనే బస్సులు నడుస్తున్నాయి.