జగిత్యాల పట్టణంలోని రహదారులపై రద్దీ పెరిగింది. కొత్త బస్టాండ్, టవర్ సర్కిల్, పాత మార్కెట్, అంగడి బజార్ మార్కెట్, రైతు బజార్, యావర్ రోడ్డు ప్రాంతాల్లో జనంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. భౌతిక దూరాన్ని మరచి.. కూరగాయలు, కిరాణా సామగ్రి, ఇతర వస్తువులు కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు.
ఉదయం 10 దాటాక నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, రోడ్డుపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని డీజీపీ ప్రకటించడంతో సడలింపు వేళ పెద్దఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. జనాలంతా ఒక్కసారిగా బయటకు వస్తుండటంతో రహదారులపై రద్దీ వాతావరణం ఏర్పడుతోంది. ఫలితంగా భౌతిక దూరం మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.