ETV Bharat / state

ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలంటూ కలెక్టర్​కు వినతి పత్రం

జగిత్యాల జిల్లాలో చెరకు రైతులు కదం తొక్కారు. మూసివేసిన ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ... కలెక్టరేట్​ను ముట్టడించారు. జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

Request to the Collector to open a sugar factory at jagital
చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలంటూ కలెక్టర్​కు వినతి పత్రం
author img

By

Published : Apr 5, 2021, 1:49 PM IST

జగిత్యాల జిల్లా చెరుకు రైతులు ఆందోళన బాటపట్టారు. ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని నినదించారు. రైతుల ధర్నా దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. చక్కెర కర్మాగారం తెరిపించి ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారిపై ధర్నాతో వాహనాలు నిలిచిపోగా... ధర్నా చేస్తున్న వారిలో కొంతమందిని కలెక్టర్‌ను కలిసేందుకు పోలీసులు అనుమతించారు. అన్నదాతలు తమ సమస్యల గురించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలంటూ కలెక్టర్​కు వినతి పత్రం

ఇదీ చూడండి: చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలంటూ రైతుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.