జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్టపై రాహు కేతు సహిత నవనాగు ఆలయంలో.. సూర్యగ్రహణం సందర్భంగా సామూహిక రాహుకేతు దోశ నివారణ పూజలు నిర్వహించారు. కాలసర్పదోషం నివారణ కోసం ఆలయంలో ఏటా ప్రత్యే పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో రాహుకేతు పూజలు నిర్వహించారు. గ్రహణం రోజున అన్ని ఆలయాలు మూసివేస్తారు కానీ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!