అయోధ్యలో నిర్మించే శ్రీ రామ మందిర విరాళాలపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యే మాట్లాడటం సబబు కాదని మండిపడ్డారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది
రామ మందిర నిర్మాణానికి సంబంధించి భాజపా కార్యకర్తలు విరాళాలు సేకరించదలచిన నేపథ్యంలో.. గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రైతుల భూముల్లో అధికారుల ఎర్రజెండాలు!