సర్పంచులకు, ఉప సర్పంచులకు ఉమ్మడి చెక్ పవర్ నిర్ణయంపై జగిత్యాల కలెక్టరేట్ ముందు సర్పంచులు ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన సర్పంచులు గంటకు పైగా నిరసన చేపట్టారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అంద జేశారు. ఉపసర్పంచ్‌లకు కూడా చెక్ పవర్ ఉంటే.. అధికారం దుర్వినియోగం జరుగుతుందని ఆరోపించారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం