జగిత్యాల జిల్లా ధర్మపురిలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా పెరిగాయి. చిన్న పాటి వర్షానికే విద్యుత్ సరఫరా నిలిచి పోయి వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ధర్మపురిలో 33/11 కే.వీ. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మూడు దశాబ్దాల కింద ఏర్పాటు చేసిన బ్రేకర్లను మార్చకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది.
ధర్మపురి సబ్‌స్టేషన్‌లో మొత్తం 6 బ్రేకర్లు ఉన్నాయి. తిమ్మాపూర్, ధర్మపురి పట్టణం, తిమ్మాపూర్, దమ్మన్నపేట, కమలాపూర్, బృహత్తర నీటి పథకాలకు చెందిన బ్రేకర్లు ఉండగా, వీటిలో మొదటి మూడు దశాబ్దాల కిందటి నాటివే. చిన్న గాలివాన వీచినా సాంకేతిక లోపం ఏర్పడి, కరెంట్ సరఫరా నిలిచి పోతోంది. వీటిని తొలగించి నూతనంగా బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, విద్యుత్ అధికారులు చొరవ తీసుకోవడం లేదు.
ధర్మపురిలో విద్యుత్ కనెక్షన్లు బాగా పెరిగాయి. చిన్నపాటి గాలివాన కురిసినా, బ్రేకర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచి పోతోంది. వీటిని మార్చి, నూతనంగా సబ్‌స్టేషన్‌లో విద్యుత్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్