ETV Bharat / state

జగిత్యాలలో నేడు నమూనా పోలింగ్​ కేంద్రం ప్రారంభం

author img

By

Published : Apr 4, 2019, 5:50 AM IST

Updated : Apr 4, 2019, 11:34 AM IST

ఈ ఎన్నికల్లో నిజామాబాద్​ది ప్రత్యేక స్థానం. అత్యధికంగా 185 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ఓటేసే వారికి అవగాహన కోసం జగిత్యాల కలెక్టర్​ నమూనా పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ఇవాళ ఎన్నికల అధికారులు ప్రారంభించనున్నారు.

ఈవీఎం
మోడల్​ పోలింగ్​ కేంద్రాలు ప్రారంభించనున్న ఎన్నికల అధికారులు
ఓటర్లను చైతన్య పరిచేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్​ డాక్టర్​ శరత్​ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంతో పాటు, కోరుట్ల పట్టణంలో మోడల్​ పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారులు వీటిని ప్రారంభించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా.. పోలింగ్​ కేంద్ర నమూనా చిత్రాలను ప్రదర్శించనున్నారు. యూ ఆకారంలో 12 ఓటింగ్​ యంత్రాలతో పాటు, వీవీ ప్యాట్​లను అందుబాటులో ఉంచారు. వీటిపై ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు.

కవిత సందర్శన

జగిత్యాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెరాస ఎంపీ కవిత నమూనా పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించారు. అభ్యర్థుల జాబితా, వీవీప్యాట్​ యంత్రాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి :'దేశ గతిని మార్చే అజెండా రూపొందిస్తున్నాం'

Intro:TG_KRN_102_03_ETELA_ROAD SHOW_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
సిద్దిపేట జిల్లా కోహెడ లో సుమారు వెయ్యి మంది తెరాస కార్యకర్తలతో కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మంత్రి ఈటల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గడచిన 50 ఏళ్లలో కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు దేశాన్ని పాలించి దేశ అభివృద్ధికి తోడ్పడలేదని రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు విజయం సాధించి కేంద్రంలో ప్రధాన మంత్రి ఎవరో నిర్ణయించే అధికారం కలిగి ఉంటాయని అందుకే తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే కేంద్రంలో ప్రధాన మంత్రి ఎవరో నిర్ణయించి కేంద్ర ప్రభుత్వంలో పాలుపంచుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు ఉంటుందని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్ళ వచ్చని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తెలిపారు. అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ తెలంగాణ భూభాగంలో ఉన్న సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రాలో కలిపి, తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిన బిజెపి ప్రభుత్వానికి ఎందుకు మనం ఓటు వేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేపడుతున్నామని అవి దేశానికే ఆదర్శంగా ఉన్నాయని తెలుపుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ ను రాష్ట్రంలోని మిగతా స్థానాల ఎంపీల కన్నా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Body:బైట్స్

1) కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్

2) మంత్రి ఈటల రాజేందర్

Conclusion:సిద్దిపేట జిల్లా కోహెడ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార ర్యాలీ
Last Updated : Apr 4, 2019, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.