ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెట్పల్లి పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలో నిర్వహించిన ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మీ సేవ నిర్వాహకులు నరేష్ తన సొంత ఖర్చులతో 200 జ్యూట్ బ్యాగులను తయారు చేసి కమిషనర్‌కు అందించారు. జగదీశ్వర్ రెడ్డి ఆ జనపనార సంచులను కార్యాలయ ఉద్యోగులతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు అందించి ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత పట్టణ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : భారీ నష్టాల్లో ఆదిలాబాద్ ఆర్టీసీ