ETV Bharat / state

వరాలిచ్చే గణపయ్య ఉపాధి కల్పిస్తున్నాడు

వినాయక చవితి.. తొమ్మిదిరోజులు కన్నుల పండువలా జరుపుకుంటారు. కానీ ఈ పండుగ కొందరికి కొన్ని నెలల ముందుగానే ప్రారంభమవుతోంది. వాళ్లెవరనుకుంటున్నారా.... ఇంకెవరు విగ్రహాలు తయారుచేసేవారు. పొట్టకూటికోసం బొజ్జగణపయ్యలను తయారుచేస్తూ ఎందరో ఉపాధి పొందుతున్నారు. భక్తుల కోర్కెలు నెరవేర్చే గణపయ్య ఎందరికో ఉపాధినిస్తున్నాడు.  ఏటా వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా విగ్రహాల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నవారిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

వరాలిచ్చే గణపయ్య ఉపాధి కల్పిస్తున్నాడు
author img

By

Published : Aug 29, 2019, 9:30 AM IST

Updated : Aug 30, 2019, 1:02 PM IST

వరాలిచ్చే గణపయ్య ఉపాధి కల్పిస్తున్నాడు

బొజ్జగణపయ్య భక్తుల కోర్కెలు నెరవేర్చే దేవుడే కాదు. చాలామందికి ఉపాధి నిచ్చే ప్రభువు. తమ హస్తకళతో వేలాది విగ్రహాలను తయారు చేసి జీవనం సాగించేవారు ఏటా పెరుగుతూనే ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం విగ్రహాల తయారీకి కేంద్రబిందువు. ఇక్కడ సంవత్సరం పొడవునా విగ్రహాలు తయారుచేస్తూనే ఉంటారు. ఇక్కడ సుమారు 13 విగ్రహ తయారీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో 20 నుంచి 30 మంది బొమ్మల తయారీలో నిమగ్నమై ఉంటారు.

ఏళ్లనాటి అనుభవం

కోరుట్ల పట్టణం సుమారు 35 ఏళ్ల నుంచి విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఎలాంటి విగ్రహం కావాలో ముందే చెబితే నచ్చిన రీతిలో ప్రతిమ తయారుచేసి ఇస్తారు. తెలంగాణ జిల్లాలతో పాటు, ఏపీలోని పలు జిల్లాల నుంచి భక్తులు వచ్చి విగ్రహాలు తీసుకెళ్తారు.

ఆకట్టుకునే విగ్రహాలకు కేరాఫ్​గా..

ఇక్కడ రకరకాల రూపాల్లో గణనాథుడి విగ్రహాలు తయారు చేస్తారు. నాగలి పట్టుకుని ఎడ్లబండి తోలుతున్నట్లు, బాహుబలి వినాయకుడు... ఇలా చూడగానే ఆకట్టుకునే విగ్రహాల తయారీ ఇక్కడ ప్రత్యేకత. ప్రతి సీజన్​లో ఇక్కడి విగ్రహాలకు డిమాండ్​ పెరుగుతూనే ఉంది. సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగానే వ్యాపారం అవుతోంది. పూజించే భక్తులకు వరాలివ్వడమే కాదు.. తయారు చేసే వారికి ఉపాధిని కూడా ఇస్తున్నాడు గణనాథుడు.

ఇదీ చూడండి: ఆదర్శం... ఈసారి మిట్టపల్లిలో వినాయకుడు మురిసేలా వేడుకంట!

Intro:TG _krn_11_26_vinayaka upaadhi_pkg _BYTES 1_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్:9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ :
ఈ వార్తకు సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపుతున్నాను వాడుకోగలరు

Body:upaadhi

Conclusion:TG _krn_11_26_vinayaka upaadhi_pkg _BYTES 1_TS10037
Last Updated : Aug 30, 2019, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.