పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ రెవెన్యూ అధికారులకు దొరికిపోయాడు ఓ రైస్ మిల్ వ్యాపారి.జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేష్ ఇండస్ట్రీస్‌లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వచేశారన్న సమాచారాన్ని పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా... స్థానిక తహసీల్దార్ గణేష్ ఇండస్ట్రీస్‌లో తనిఖీలు నిర్వహించారు.
మూడు గోదాంలలో నిల్వచేసిన సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. యజమానిపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి అక్రమంగా నిల్వచేసిన బియ్యాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి తరలించారు.
ఇవీ చూడండి: కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్..