ఓనం పండుగను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో కేరళకు చెందిన ఉపాధ్యాయులు ఓనమ్ ఉత్సవాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. దీపారాధన చేసి శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శించారు. వివిధ రకాల పదార్థాలతో ప్రత్యేక వంటకాలు చేసి స్థానికులతో కలిసి సామూహిక భోజనం చేశారు. ఇతర రాష్ట్రంలో తమ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయురాలు తెలిపారు.
ఇదీ చదవండిః సంప్రదాయాల ప్రతిబింబం.. 'ఓనం' పండుగ ఆరంభం