పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడేలా చూడాలని అధికారులకు జగిత్యాల పుర పాలక సంస్థ చైర్పర్సన్ సుజాత సూచించారు. ఈ మేరకు జిల్లాలోని మెట్పల్లి పురపాలక కార్యాలయంలో ఆమె పట్టణ పరిశుభ్రతపై స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చైర్పర్సన్ సుజాత సూచించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ సమయంలో ఉపయోగించేందుకు సిబ్బందికి రికార్డు పుస్తకాలను, సామగ్రిని అందించారు. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరు భాగస్వాములు అయ్యేలా చూడాలని పుర కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: జీవన్‌రెడ్డి నివాసం వద్ద భారీగా సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు