ETV Bharat / state

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌.. జగిత్యాల జిల్లాలో అమలు - జగిత్యాల జిల్లాలో నో హెల్మెట్‌.. నో పెట్రోల్

హెల్మెట్‌ లేదా.. అయితే మీకు పెట్రోల్​ లేనట్లే. పెట్రోలు సీసాల్లో కావాలా.. అయినా లేనట్లే. చిన్న పిల్లలని పెట్రోల్​కు పంపారా.. వారు ఖాళీ చేతులతో ఇంటికి రావాల్సిందే. ఇదేంటి కొత్త నిబంధనలు అనుకుంటున్నారా! హెల్మెట్‌ లేకుంటే వాహనాల్లో పెట్రోలు పోయరాదని జిల్లా కలెక్టర్‌ రవి ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా నేటి నుంచి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.

no-helmet-no-petrol-conditions-implemented-from-today-at-jagtial-district
నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌.. జగిత్యాల జిల్లాలో అమలు
author img

By

Published : Feb 8, 2021, 3:22 PM IST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్‌.. నో పెట్రోల్​ నిబంధనను అమలు చేస్తున్నారు. హెల్మెట్‌ లేకుంటే వాహనాల్లో పెట్రోల్​ పోయరాదని జిల్లా పాలనాధికారి రవి ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా పాటించాలని పౌరసరఫరాల అధికారులు పెట్రోల్​ బంకుల యజమానులను హెచ్చరించారు. ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

ఎవరైనా హెల్మెట్‌ లేకుండా వస్తే పెట్రోల్​ పోయకుండా తిరిగి పంపిస్తున్నారు. సీసాల్లోనూ పెట్రోలు పోయరాదని ఆదేశాలు జారీ చేశారు. పెట్రోలు కోసం చిన్న పిల్లలు ఎవరైనా వచ్చినా.. తిరిగి పంపుతున్నారు. నిబంధనలు పాటించకపోతే పెట్రోల్​ బంకుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నిబంధనపై పోలీసు, పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా ప్రత్యేక దృష్టి సారించాయి.

ఇదీ చూడండి: కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.