ETV Bharat / state

ఆ ఊళ్లో బోరుబావులు వెయ్యరు.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Oct 11, 2020, 3:01 PM IST

అది వ్యవసాయాధారిత గ్రామం. పంటల్ని సాగుచేస్తేనే ఆ గ్రామ రైతుల జీవనం. సుమారు ఆరు వందల మంది రైతులు ఉండే ఈ గ్రామంలో మూడు వేల ఎకరాల విసీర్ణంలో పంటలు సాగవుతాయి. మరి, ఆ గ్రామంలో ఎన్ని వ్యవసాయ బోరుబావులు ఉండాలి? సగం మంది రైతులు తవ్వించుకున్నా కనీసం మూడు వందల బోరుబావులైనా ఉంటాయి అన్నదేనా మీ సమాధానం... అయితే ఇది చదవండి.

no borewells at ryapatnam in jagtial district
ఆ ఊళ్లో బోరుబావులు వెయ్యరు

బావుల్లో నీరు అడుగంటిన సందర్భాల్లో పంటల్ని కాపాడుకోవడానికి రైతులకు మొదట గుర్తుకొచ్చేది... బోరుబావులే. పంటల్ని రక్షించుకోవాలన్న ఆశతో వీటిని తవ్వించడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. అప్పులు చేసి మరీ తవ్విస్తారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామ రైతులు మాత్రం దీనికి విరుద్ధం. ఎంతటి కరవు పరిస్థితులు ఏర్పడినా సరే... వ్యవసాయ బావుల్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోనే పంటలను సాగు చేస్తున్నారు. వాటిలో నీరు లేకపోతే సాగును వదులుకుని ఆర్థికంగా నష్టపోతున్నారే గానీ... బోరుబావుల తవ్వకం జోలికి వెళ్లడం లేదు. కారణం... భావితరాల కోసం ఆలోచించడం, మున్ముందు నీటికి కటకట తలెత్తే ప్రమాదముందని గ్రహించడం.

కరవును చూసిన గ్రామమే...

రాయపట్నం గ్రామ రైతులకు పంటల సాగే ప్రధాన ఆధారం. ఈ గ్రామానికి చెందిన ఆరు వందల మంది రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్లలో వరి, మొక్కజొన్న, పసుపు, కూరగాయలూ సాగు చేస్తారు. ఈ పంటలతో ఎకరానికి పది వేల నుంచీ ముప్ఫై వేల వరకూ లాభాలను పొందుతుంటారు. సమీపంలోనే గోదావరి ఉన్నా... అన్ని గ్రామాల మాదిరే ఈ గ్రామమూ గతంలో ఎన్నోసార్లు కరవును చవిచూసింది.

రైతులందరి లాగే ఈ గ్రామ రైతులూ భూగర్భ జలాలు లేక నష్టాల పాలయ్యారు. అయినా... సరే, పంటలను కాపాడుకోవడానికి వీరు ఇప్పటి వరకు ఒక్క బోరుబావినీ తవ్వించలేదు. బావుల్లో నీరు లేకపోతే పంటలను పండించేదెలా అని కలత చెందలేదు. బోర్లు వేస్తే భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో తమ పిల్లలకు నీటి కష్టాలు ఎదురవుతాయన్న ఒకేఒక్క ఆలోచన ఈ రైతుల్ని ఆశయ సాధన దిశలో అడుగులు వేయిస్తోంది.

ఇదీ నేపథ్యం

పదహారేళ్ల కిందటి మాట. ప్రతి సంవత్సరం మాదిరి ఆ ఏడాదీ రైతులు పంటల సాగుకు పొలాలను దున్నుకున్నారు. తొలకరి వర్షాలకు మురిసి విత్తనాలు విత్తారు. ఆ తరవాత వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో పంటల్ని కాపాడుకోవడానికి బోరుబావులే ఏకైక మార్గమని రైతులందరూ భావించారు. ఎంత ఖర్చైనా లెక్కచేయకుండా వాటిని తవ్వించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది కేవలం రాయపట్నం గ్రామ రైతుల పరిస్థితే కాదు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల రైతులూ ఇదే బాటను ఎంచుకున్నారు. కొన్ని గ్రామాల్లోని రైతులు ఒకటి, రెండు బోరుబావుల్నీ తవ్వించుకున్నారు. ఆ గ్రామ రైతులు మాత్రం అంతటి కరవు కాలంలోనూ బోరుబావుల్ని తవ్వించుకోకూడదని తీర్మానించుకున్నారు. ఇప్పటికీ అదే బాటను అనుసరిస్తూ జల సంరక్షణలో భాగమవుతున్నారు.

పిల్లలకు కష్టాలు రానివ్వద్దనీ...

భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు తాగునీటికీ, సాగునీటికీ ఇబ్బందులు పడుతున్నారంటూ పత్రికల్లో చదివీ టీవీల్లో చూసీ రాయపట్నం గ్రామస్థులు ఆలోచనలో పడ్డారు. ఎక్కువ లోతులో, అడ్డగోలుగా బోరుబావుల్ని తవ్వితే భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తు తరాలకు తాగునీటి కటకట తప్పదని హెచ్చరిస్తూ ప్రచురితమైన కథనాలు ఆ గ్రామస్థుల్ని కదిలించాయి. దీంతో, పంటల్ని సాగు చేయక నష్టపోయినా సరేగానీ పిల్లలకు నీటి కష్టాల్ని రానివ్వొద్దన్న నిర్ణయానికి వచ్చారు. ఆ తరవాత ఓ రోజు సమావేశమై గ్రామంలో పంటల సాగు, జల వనరుల గురించి చర్చించారు.

ప్రస్తుతమున్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా బోరుబావుల్ని తవ్వించుకుంటే రెండు, మూడు సంవత్సరాలు లాభాల్ని పొందుతామేమోగానీ ముందుముందు మన వారసులు తాగడానికి సైతం నీళ్లు లేక ఇబ్బంది పడతారని అందులోని కొందరు మిగిలిన రైతులకు వివరించారు. అనంతరం... గ్రామస్థులంతా ఏకమై గ్రామంలో వ్యవసాయ అవసరాల కోసం బోరుబావుల్ని తవ్వించకూడదనీ, బావుల్లోని నీటితోనే పంటల్ని సాగు చేసుకోవాలనీ తీర్మానించుకున్నారు. ఇలా గ్రామంలోని వ్యవసాయ భూముల్లో ఇప్పటి వరకు ఒక్క బోరుబావినీ తవ్వించలేదు. ఫలితంగా... ప్రస్తుతం ఆ గ్రామంలోని ప్రతి బావీ చేతికి అందే నీటితో కళకళలాడుతోంది. ప్రతి సీజన్‌లోనూ పచ్చని పొలాలకు జీవం పోస్తోంది. భావితరాలకు నీటి కొరత లేకుండా ఆశల సుమాల్ని పూయిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.