పెండింగ్‌లో ఉన్న రైతుబంధు బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పర్యటించారు. రైతుల సంక్షేమం కోసం అత్యధిక నిధులు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని ఆయన పునరుద్ఘాటించారు. సాగు విస్తీర్ణం పెరగడంతోనే కొన్ని కేంద్రాల్లో యూరియా సరిపోలేదన్నారు. ప్రతిపక్షాలు గోరంతను కొండంతలు చేసి అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో యూరియా నిల్వలపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
సాగు విస్తీర్ణం పెరిగినందునే యూరియా సరిపోవట్లేదు
జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. సాగువిస్తీర్ణం పెరిగినందునే కొన్ని కేంద్రాల్లో యూరియా సరిపోలేదని నిరంజన్ రెడ్డి అన్నారు.