జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే పండుగలో గీతకార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఒకే తాటిపై 9మంది గీతకార్మికులు ఎక్కి కల్లును కిందికి దింపారు. అమ్మవారికి సమర్పించే కల్లు కుండను, మోకు ముస్తాదుకు అంటకుండా... చేతుల మీదుగా దించి సమర్పించడం ఆనవాయితీ.
ఈ కార్యక్రమాన్ని గీతకార్మికులు అట్టహాసంగా నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఒకే చెట్టుపై 9మంది కల్లును దించేందుకు ఎక్కిన తరుణంలో.. ఈలలు, కేరింతలు మారుమోగాయి. అనంతరం కుల పెద్ద కల్లు కుండను నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో ఆలయం వరకు వెళ్లి కల్లు సమర్పించారు.
ఇదీ చదవండి: దిగుబడి పెరిగినా కొనే నాథుడు లేక మక్క రైతుల ఆందోళన