జగిత్యాల పట్టణంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు మెట్పల్లి పురపాలక ఛైర్పర్సన్ సుజాత అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని నాలుగు శ్మశాన వాటికలో అభివృద్ధికి ఛైర్పర్సన్ సుజాత భూమి పూజ చేశారు. 50 లక్షలతో స్మశానవాటికలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
శ్మశాన వాటికలకు ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సహకారంతో పూర్తి స్థాయిలో శ్మశాన వాటికను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: తొలి మహిళా మైన్ మేనేజర్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందన