MLC Kavitha fires on Rahul Gandhi : దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న ఎమ్మెల్సీ కవిత.. ఆయన వెంట ఉన్న వారిలో దొరలున్నారా..? దళితులున్నారా..? అని ప్రశ్నించారు. కుల గణనకు కేసీఆర్ వ్యతిరేకమని చెబుతున్న ఆయన.. మతి ఉండి మాట్లాడుతున్నారా..? అని మండిపడ్డారు. రాహుల్ చెప్పే కులగణన రాష్ట్రంలో పదేళ్ల కిందే పూర్తయ్యిందని.. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కాంగ్రెస్ స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోండంటూ హితవు పలికారు.
MLC Kavitha Metpally Press Meet : రాహుల్ గాంధీ కుటుంబానికి, తెలంగాణకు.. నమ్మక ద్రోహ సంబంధం ఉందని విమర్శించారు. కేసీఆర్(CM KCR) స్వరాష్ట్ర సాధనకు దీక్ష చేస్తే.. తన జన్మ దిన కానుకగా సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారన్నారు. కానీ వారికి వారుగా ఇవ్వలేదని పేర్కొన్నారు. నేడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని.. అతను రాహుల్ గాంధీ కాదు ఎలక్షన్ గాంధీ అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో తొమ్మిది మండలాలను లాక్కుంటే.. విభజన హామీలపై ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ హయాంలోనే న్యాయం జరిగిందన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి బాగోగులు పట్టించుకోలేదన్నారు. నిజాం చక్కర పరిశ్రమను 1937లో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ఏర్పాటు చేసిందంటూ జీవన్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూతపడ్డ చక్కెర పరిశ్రమను పున ప్రారంభించకుండా.. బీజేపీ ఎంపీ అరవింద్ న్యాయపరమైన చిక్కులు సృష్టించారన్నారు. లీగల్ ఇబ్బందులు లేకపోతే పరిశ్రమను పున ప్రారంభించేవారమన్నారు.
Telangana Assembly Elections 2023 : రాహుల్ గాంధీ బబ్బర్ శేర్ కాదు.. పేపర్ పులి మాత్రమే అని ఎద్దేవా చేశారు. జీవన్‌రెడ్డికి సీనియారిటీ తప్ప.. సిన్సియారిటీ లేదని విమర్శించారు. వయస్సు మరచిపోయి.. తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తనను ఎలిజబెత్ రాణి అని మాట్లాడితే ఎంపీ అరవింద్ మాట్లాడారనుకున్నాని .. కాని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని తెలిసి బాధ పడ్డానన్నారు. ఇది కేవలం ఎన్నిక మాత్రమే అని.. దాని కోసం ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా బీడీ కార్మికులకు పనికొచ్చే విధంగా ఉందని.. కటాఫ్ తేది లేకుండా బీడీ కార్మికులకు 3000 పింఛన్ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి 5లక్షల బీమా కూడా అమలు చేస్తామన్నారు. గల్ఫ్‌కి ఉపాధి కోసం వెళ్లిన వారు చాలా మంది తిరిగి వస్తున్నారని.. చాలా సంతోషంగా ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యంతో పాటు.. 15లక్షల ఆరోగ్య బీమా ఇస్తామన్నారు.
"తెలంగాణతో.. రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మకద్రోహ బంధమే ఉంది. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అంటూ రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కులగణనకు కేసీఆర్ వ్యతిరేకమని చెబుతున్నారు. పదేళ్ల కిందట తెలంగాణలో సమగ్ర సర్వే పేరుతో.. కులగణన చేశాం. రాహుల్ తన స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలి". - కవిత, ఎమ్మెల్సీ బీఆర్ఎస్