ETV Bharat / state

'అబద్ధానికి ప్రతిరూపం ధర్మపురి అర్వింద్​...'

mlc kavitha: కాంగ్రెస్‌, భాజపా నేతలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే తెరాస హయాంలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఆమె సూచించారు.

ఎమ్మెల్సీ  కవిత
ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : May 21, 2022, 5:47 PM IST

Updated : May 21, 2022, 7:31 PM IST

mlc kavitha: అబద్ధానికి ప్రతిరూపం ఎంపీ అర్వింద్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిజామాబాద్‌ ఎంపీగా అర్వింద్‌ నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. ఎక్కడికి వెళ్లినా తెరాస చేసిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కోరుట్ల నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కవిత.. విపక్ష నేతలపై విమర్శలు చేశారు.

పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసి గద్దెనెక్కిన అర్వింద్ .. పసుపు రైతులను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మరచి అన్నింటికి ధరలను పెంచడంపై దృష్టి సారించిందని కవిత పేర్కొన్నారు . మరోపక్క జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పుడు చూసినా.. తెరాస పైన, కేసిఆర్ పైనే విమర్శలు చేస్తారన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కనపడటం లేదా.. లేక వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త తెరాస పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

"రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ఠానికి పడిపోయింది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఎక్కడ ఉన్నవి ఉద్యోగాలు. మన తెలంగాణకు ఒక్క ఐఐటీ ఇచ్చారా..? ఈ విషయాల గురించి గ్రామాల్లో చర్చించాలి. కాంగ్రెస్ వారు రచ్చబండ పేరుతో గ్రామల్లోకి వస్తే వారికి ప్రగతి పార్క్​లు.. అభివృద్ధి పనులను చూపించండి." - కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ

కాంగ్రెస్‌, భాజపా నేతలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు

ఇదీ చదవండి: REVANTH REDDY: 'కాంగ్రెస్​ ప్రభుత్వంలో అన్నదాత తలెత్తుకుని బతికేలా చేస్తాం'

'భారత- చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్​ లాంటి పరిస్థితులు'

Last Updated : May 21, 2022, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.