వరి ధాన్యం కొనుగోళ్లలో అన్‌లోడ్ పేరిట మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ... రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా లోని చిన్నపూర్, అరెపల్లి, అనంతారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
అనంతరం రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్వింటాలు ధాన్యానికి 5 నుంచి 9 కిలోలు కోత పెడుతుండటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే రూ. 40 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో 4 డేంజర్ జోన్లు..అవి ఏంటో తెలుసా..!