జగిత్యాల మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అండగా నిలిచారు. సుమారు 300 మంది పారిశుద్ధ్య కార్మికులకు లక్షా ఇరవై వేల రూపాయల విలువచేసే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నూనె, పప్పు, సబ్బులు, సానిటైజర్ తదితర వస్తువులను కార్మికులకు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ వంతు సాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
వైద్యులు, పోలీసు యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పని చేస్తున్నారన్నారని వారి సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్... రూపొందించిన డీఆర్డీవో