ఆడబిడ్డల వివాహానికి కేసీఆర్ పెద్దదిక్కుగా మారి కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 43మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
రాష్ట్రం అభివృద్ధి చెందటానికి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని సుంకె రవిశంకర్ అన్నారు. దేశంలో వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తెరాసదేనని స్పష్టం చేశారు. ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు నిరూపిస్తే... 10 వేల రివార్డు