జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 31 మంది లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఉన్న ఆర్థికసాయం రూ.51 వేల నుంచి రూ.1,00,116 పెంచారని అన్నారు. వృద్ధులకు ఫించన్లు, రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా తెరాస ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర