జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ప్రారంభించారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు చీర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మహానగరంలో సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు