రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి 24వ వార్డులో సీసీ రోడ్లు, తాగునీటి వ్యవస్థకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: రోగిని బెడ్‌షీట్‌తో లాక్కెళ్లిన ఆసుపత్రి సిబ్బంది