రైతుల శ్రేయస్సు కోసమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వెంపేట గ్రామాల్లో పాటు మల్లాపూర్ మండలంలోని రాఘవపేట, సిరిపూర్, నడికూడాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రవితో కలిసి ఆయన ప్రారంభించారు.
రైతులతో మాట్లాడి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి అన్నదాతలు లాభపడాలని కోరారు.
ఇదీ చదవండి: పట్టణ ప్రకృతి వనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు