జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో రెండో రోజు స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే దంపతులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు అందించారు.
స్వామివారికి తెల్లవారుజాము నుంచి వివిధ రకాల పూజలు నిర్వహించారు. ధ్వజారోహణం, తోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, నిత్య పూర్ణాహుతి తదితర పూజలు చేపట్టారు. ఈ వేడుకలను భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?