ETV Bharat / state

'వ్యర్థాలను ఎరువుగా మార్చే విధానం ఏర్పాటు చేస్తాం'

పట్టణ ప్రగతిలో భాగంగా నూతన చెత్త వాహనాలను జగిత్యాలలో ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌ ప్రారంభించారు. మురికి కాలువల్లో ప్లాస్టిక్, చెత్తను పడేయడం వల్ల దోమలు, ఈగలు తయారై అంటువ్యాధులు ప్రబలతాయన్నారు. జిల్లాలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ఎరువుగా మార్చే విధానంను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

author img

By

Published : Feb 13, 2021, 2:04 AM IST

MLA Dr. Sanjay Kumar and Collector Ravi started new garbage vehicles in Jagityala as part of urban progress
'వ్యర్థాలను ఎరువుగా మార్చే విధానం ఏర్పాటు చేస్తాం'

పరిశుభ్రతకు ఏక్కువ ప్రాధాన్యత ఇచ్చి జగిత్యాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌ అన్నారు. మురికి కాలువల్లో ప్లాస్టిక్, చెత్తను పడేయడం వలన దోమలు, ఈగలు తయారై రకరకాల అంటువ్యాధులు ప్రబలతాయని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నూతన చెత్త వాహనాలను కలెక్టర్‌ రవితో కలిసి ప్రారంభించారు.

కోటి 53 లక్షలతో కొనుగోలు చేసిన 20 స్వచ్ఛ ఆటోలు, 2 తాగునీటి ట్యాంకు ట్రాక్టర్లు ప్రారంభించుకోవడంతోపాటు, 30 మంది డ్రైవర్లను నియమించామని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో 2 కోట్ల 50 లక్షల నిధులతో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ఎరువుగా మార్చే విధానంను ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సేకరించే తడి, పొడి చెత్తను వేరు చేసి తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు.

టీఆర్ నగర్, నూకపెల్లికి 7.5 కోట్లతో మిషన్ భగీరథ మంచి నీటి కార్యక్రమం చేపట్టడం జరగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఐటీ వినియోగంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.