జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల పురపాలక పరిధిలోని పట్టణాల్లో రెండేళ్ల క్రితం ప్రారంభమైన భగీరథ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల గుత్తేదార్లు పనులను మధ్యలోనే ఆపివేశారు.
భగీరథ కోసం ఎక్కడపడితే అక్కడ గుంతలు తవ్వడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటికి పైపు కనెక్షన్ ఇచ్చి, పాత పైపుల ద్వారానే నీటిని సరఫరా చేస్తుండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని భగీరథ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రజలు కోరుతున్నారు.