కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం, వెలగటూరు, ధర్మపురి, బుగ్గారం మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
గోపులాపూర్లో సీతారామాంజనేయస్వామి దేవాలయానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి.. ఎంఆర్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మపురిలో దేవాలయ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఇదీ చూడండి: సింగరేణి ఛైర్మన్ కొనసాగింపుపై కేంద్రం అభ్యంతరం