ETV Bharat / state

జగిత్యాల ఇరిగేషన్‌ అధికారులతో.. మంత్రి కొప్పుల సమీక్ష

జగిత్యాల జిల్లాలో  పర్యటించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఇరిగేషన్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని చెరువులను నింపడమే గాక.. నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను గుర్తించి నీరందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

minister koppula eshwar meeting with jagitial irigation officers
జగిత్యాల ఇరిగేషన్‌ అధికారులతో.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమీక్ష సమావేశం
author img

By

Published : Jul 24, 2020, 10:08 PM IST

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ జగిత్యాల జిల్లాకేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఇరిగేషన్​ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు సంజయ్​ కుమార్​, కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు, సుంకె రవిశంకర్​, జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు దావ వసంతలతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు నుంచి లెఫ్ట్​ కెనాల్​ పూర్తి చేసి.. చెరువులు నింపాలని, జోగాపూర్​ చెరువు నుంచి రుద్రంగి సూరమ్మ చెరువు, మేడిపల్లి, కథలాపూర్​ మండలాలలు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని నీటి పారుదల అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటి పారుదల సమస్యలు లేకుండా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.