ETV Bharat / state

చిరుధాన్యాలతో అల్పాహారం.. క్యూ కడుతున్న భోజనప్రియులు - millet breakfast

ఆరోగ్యానికి సిరులవంటివి.. చిరు ధాన్యాలు. వీటిని సిరి ధాన్యాలని కూడా అంటారు. మంచి ఆరోగ్యాన్నిచ్చే వీటితో రుచికరమైన అల్పాహారం తయారు చేస్తున్నాడు ఓ యువకుడు. కనుమరుగైన ఈ పాత కాలపు ఉత్పత్తులతో అల్పాహారం రుచిగా ఉన్నందున ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ ఆసక్తిని ఉపాధిగా మార్చుకున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు.

millet breakfast in jagtial
జగిత్యాలలో చిరుధాన్యాలతో అల్పాహారం
author img

By

Published : Dec 26, 2019, 4:33 PM IST

Updated : Dec 27, 2019, 9:38 AM IST

చిరుధాన్యాలతో అల్పాహారం.. క్యూ కడుతున్న భోజనప్రియులు
కనుమరుగైన ఈ పాత కాలపు చిరు ధాన్యాలతో ఓ యువకుడు నోరూరించే అల్పాహారం తయారు చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన కొలగాని జలందర్‌.. అతని భార్య హరితతో కలిసి జగిత్యాలలో ఓ ఇడ్లీ సెంటర్​ను ఏర్పాటు చేశాడు.

పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం సమీపంలో పాత కాలపు ఉత్పత్తులైన కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, రాగులతో అల్పాహారం అందిస్తున్నాడు. వేరే చోట్ల వీటి ధర ఎక్కువ ఉంటుందని.. ఇక్కడ 25 రూపాయలకే అందిస్తున్నామని జలందర్​ తెలిపాడు.

ఇవి రుచికరంగా ఉండటమే కాక మంచి ఆరోగ్యాన్ని కలిగించే చిరు ధాన్యాలు కావడం వల్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నిత్యం ఒకే రకమైన టిఫిన్​ తినే వారికి కొత్తదనమైన అల్పాహారం దొరుకుతున్నందున క్యూ కడుతున్నారు.

సొంతగా నిర్వాహకులే వంటకాలు చేయడం.. రుచిగా ఉండటం వల్ల వినియోగదారులు కూడా చాలా బాగుందంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్​ రహదారి పక్కనే ఉన్నందున ఈ మొబైల్​ టిఫిన్​ సెంటర్​ వద్ద అల్పాహారం ఆరగించి వెళ్తున్నారు. వినియోగదారులు పెరిగితే మరిన్ని వంటకాలు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు అంటున్నారు.

Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా, 8008573563 .............. TG_KRN_21_26_SIRU DHANYALA_VANTALU_VO_TS10035 నోరూరిస్తున్న సిరు ధాన్యాల వంటలు పాతకాలపు వంటల్లోనే ఆరోగ్యం అంటున్న స్థానికులు... ఆసక్తి చూపుతున్న వినియోగదారులు ...... note.. వాయిస్ ఓవర్ తో ఇచ్చాను... స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపాను... మొత్తం రెండు ఫైళ్లు... ఒకటి వాయిస్ ఓవర్.... మరొకటి ఈటీవీ కోసం ఒరిజినల్... ఉంటుంది...

Body:.

Conclusion:.
Last Updated : Dec 27, 2019, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.