కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి నిత్యం ప్రజలకు సేవలందించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని మంత్రులు ఇచ్చిన సూచనల మేరకు అధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఛైర్ పర్సన్ సుజాత ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించారు.
పరీక్షల అనంతరం వారికి కావలసిన మందులను ఉచితంగా అందించారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్మికులకు వైద్యులు సూచించారు. నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. పదేపదే చేతులు శుభ్రం చేసుకోవాలని కార్మికులకు సూచించారు.